మూడు ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

-

మణిపుర్‌, త్రిపుర, మేఘాలయ ఈశాన్య రాష్ట్రాలు ఇవాళ రాష్ట్ర అవతరణ దినోత్సవాలను జరుపుకుంటున్నాయి. ఈ సందర్భంగా అక్కడి ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ఇది మూడు రాష్ట్రాల ప్రజలు సాధించిన విజయాలను గుర్తు చేసుకునే ప్రత్యేక సందర్భం అంటూ ట్వీట్‌ చేశారు.

రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మోదీ మణిపుర్‌ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భారత దేశాభివృద్ధికి రాష్ట్రం బలమైన సహకారాన్ని అందించిందని అన్నారు. ఈ ప్రాంత సంస్కృతి, సంప్రదాయాల పట్ల గర్విస్తున్నానని.. మణిపుర్‌ నిరంతర అభివృద్ధి చెందాలని ప్రార్థిస్తున్నానని మోదీ ట్వీట్లో పేర్కొన్నారు. మరోవైపు మేఘాలయా ప్రజలకు శుభాకాంక్షలు చెబుతూ రాబోయే రోజుల్లో రాష్ట్రం సరికొత్త అభివృద్ధి శిఖరాలను అందుకోవాలని ఆకాంక్షిస్తున్నానని ట్వీటారు. ఇక త్రిపుర ప్రజలను ఉద్దేశించి.. ‘‘ఈ ప్రత్యేకమైన రోజున త్రిపుర ప్రజల శ్రేయస్సు, సామరస్యాన్ని కోరుకుంటున్నా. ఘన చరిత్ర, వారసత్వాన్ని గుర్తు చేసుకునే ప్రత్యేకమైన రోజు ఇది’’ అని ప్రధాని సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news