క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ యంగ్ బ్యాటర్ శుభ్మన్ గిల్ ప్రేమలో ఉన్నట్లు గతంలో కొన్ని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ జంట సోషల్ మీడియాలో లవ్లీ పోస్టులు చేయడం, ఒకరి పోస్టులకు మరొకరు హార్ట్, లవ్ సింబల్స్తో రియాక్ట్ అవ్వడం చూసి నెటిజన్లు ఈ జంట మధ్యలో ఏదో నడుస్తుందని పుకార్లు పుట్టించారు. ఇక గిల్ ఆడే మ్యాచులకు సారా రావడం, అతడు మంచి స్కోరు చేసినప్పుడు ఆమె ఆనందం వ్యక్తం చేయడంతో ఇది నిజమేనని నెటిజన్లు ఫిక్స అయ్యారు.
అయితే గత కొంత కాలం క్రితం గిల్ బాలీవుడ్ బ్యూటీ సారా అలీఖాన్తో కలిసి విదేశాల్లో చక్కర్లు కొట్టడం కెమెరాకు చిక్కడంతో ఆ ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. అప్పటినుంచి గిల్ ఈ సారాకు బ్రేకప్ చెప్పి ఆ సారాతో లింక్ అయ్యాడనే వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా గిల్ సోదరి షహనీల్ గిల్ , సారా టెండూల్కర్ ఒకే కారులో కనిపించడం నెట్టింట హాట్ టాపిగ్గా మారింది. వీరిద్దరూ కలిసి ముంబయిలో శనివారం రాత్రి కారులో ప్రయాణిస్తుండగా కెమెరాకు చిక్కడంతో మరోసారి సారా టెందూల్కర్, శుభ్మన్ గిల్ రిలేషన్లో ఉన్నారన్న పుకార్లు తెరపైకి వచ్చాయి.
https://twitter.com/Unfunny_hun/status/1748774759695896688a