ఐఏఎస్ పూజా ఖేడ్కర్ ఇంటిపైకి బుల్డోజర్

-

యూపీఎస్సీకి తప్పుడు అఫిడవిట్‌ సమర్పించడం, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో మహారాష్ట్రకు చెందిన ట్రెయినీ ఐఏఎస్‌ పూజా ఖేడ్కర్‌ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. తాజాగా పుణెలోని పూజా ఖేడ్కర్ కుటుంబ నివాసం బయట ఉన్న అక్రమ నిర్మాణాలపై పుణె మున్సిపల్ కార్పొరేషన్ చర్యలు చేపట్టింది. ఆ ఇంటికి ఆనుకొని ఉన్న నిర్మాణాలను బుల్డోజర్‌తో కూల్చివేసింది. దీనికి సంబంధించి పీఎంసీ ఇప్పటికే నోటీసులు ఇచ్చినా ఆ కుటుంబం నుంచి ఎలాంటి స్పందనా రాలేదని అందుకే చర్యలకు ఉపక్రమించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు.

పుణెలో బ్యూరోక్రాట్‌గా పదవిని దుర్వినియోగం చేయడం.. తన ప్రైవేటు ఆడీ కారుకు సైరన్‌, మహారాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్‌, వీఐపీ నంబర్‌ ప్లేట్లను అనుమతి లేకుండా వాడినట్లు పూజా ఖేడ్కర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం జిల్లా ట్రైనింగ్ ప్రోగామ్లో భాగంగా ఆమె నిర్వర్తిస్తున్న విధుల నుంచి రిలీవ్ కావాలని సూచించింది. జులై 23లోగా ముస్సోరిలోని లాల్ బహుదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version