మహారాష్ట్రలోని ముంబయి, నవీ ముంబయిలను కలిపే అటల్ బ్రిడ్జిపై గత కొద్ది రోజులుగా ఆత్మహత్యాయత్న ఘటనలు జరుగుతున్నాయి. అయితే అధికారులు సకాలంలో స్పందించి చాలా వాటిని నియంత్రించారు. తాజాగా మరో ఘటన చోటుచేసుకుంది. అటల్ సేతు సి లింక్‌లో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడుతుండగా గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఆమెను కాపాడారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ములుంద్ లో నివసిస్తున్న ఓ యువతి శుక్రవారం సాయంత్రం అటల్ సేతు సీ లింక్ వద్ద బ్రిడ్జిపై నుంచి సముద్రంలోకి దూకేందుకు ప్రయత్నించింది. అప్రమత్తమైన ట్రాఫిక్ అధికారులు వెంటనే అక్కడికి చేరుకున్నట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది. బ్రిడ్జికి అవతలివైపు దూకేందుకు ఆమె ప్రయత్నించగా దాదాపు నలుగురు అధికారులు ఆమెను శ్రమించి రోడ్డువైపునకు లాగారు. నవీ ముంబైకి చెందిన న్హవా షేవా ట్రాఫిక్ పోలీసుల బృందం కూడా అక్కడికి చేరుకుంది. అందరూ కలిసి ఆమె ప్రాణాలను కాపాడారు. జులైలో కూడా 38 ఏళ్ల ఇంజనీర్ అటల్ సేతుపై నుండి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే.
సీసీటీవీ ఫుటేజ్.. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళను కాపాడిన పోలీసులు.
ముంబై – అటల్ సేతు బ్రిడ్జిపై నుండి దూకి ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది.
సకాలంలో అక్కడికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు ఆ మహిళ దూకుతుండగా పట్టుకొని కాపాడారు. pic.twitter.com/Bij5i1RRgK
— ChotaNews (@ChotaNewsTelugu) August 17, 2024