హైదరాబాద్ నగరంలోని హబ్సిగూడలో తాజాగా రోడ్డు ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. ఉదయం కావడంతో ఉద్యోగస్తులు తమ ఉద్యోగానికి, విద్యార్థులు తమ పాఠశాల, కళాశాలలకు వెళ్తుంటారు. ఈ క్రమంలో హబ్సీగూడ వద్ద ట్రాఫిక్ జామ్ అయింది. సిగ్నల్ పడటంతో వాహనాలు అన్ని నిలిచిపోయాయి. ఒక ఆటోలో విద్యార్థులు పాఠశాలకు వెల్లేందుకు ప్రయాణిస్తున్నారు. అయితే పాఠశాలకు వెళ్లేందుకు ఆటో డ్రైవర్ వేగంతో దూసుకురాగా.. వెనుకాల నుంచి అంతే వేగంతో లారీ వచ్చి ఆటోను ఢీ కొట్టింది.
దీంతో ఆటో బస్సు వెనుక ముందు చక్రాల మధ్యకు వెళ్లింది. అయితే బస్సులోని ప్రయాణికులు మాత్రం ఆటో బస్సు కొట్టడం వల్లనే ప్రమాదం సంభవించిందని పేర్కొంటున్నారు. ఈ ప్రమాదంలో సాత్విక అనే విద్యార్థిని పదో తరగతి చదువుతోంది. అయితే ఈ పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతు మరణించింది. ఆటో డ్రైవర్ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. కాలు, చేతి విరిగినట్టు సమాచారం. లారీ డ్రైవర్ కారణంగా ప్రమాదం జరిగిందని కొందరూ.. ఆటో డ్రైవర్ కారణంగానే అని మరికొందరూ పేర్కొంటున్నారు. పోలీసుల విచారణలో ఏం తేలుతుందో వేచి చూడాలి.