ఢిల్లలో పోస్టర్ల కలకలం.. కాశ్మీర్ వేర్పాట వాది యాసిన్ మాలిక్ తో మన్మోహన్ సింగ్ పోస్టర్లు..!

-

పార్లమెంట్ ఎన్నికల వేళ దేశ రాజధాని ఢిల్లీలో పోస్టర్ల కలకలం రేపింది. ఢిల్లీలోని మండి హౌస్ సర్కిల్ సమీపంలో ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్తో జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ కమాండర్, కాశ్మీరీ వేర్పాటువాది యాసిన్ మాలిక్ పోస్టర్లు వెలిశాయి దీంతో ఢిల్లీ పోలీసులు వాటిని తొలగించారు. ఈ పోస్టర్లో “కాంగ్రెస్కు ఓటు వేయండి” అని పిలుపునిస్తూ, పోస్టర్లో “వాక్ స్వాతంత్రానికి మద్దతు ఇవ్వడానికి, యాసిన్ మాలిక్ విడుదలకు” ‘ఓట్ ఫర్ డెమోక్రసీ’ అని రాసి ఉంది. ఈ పోస్టర్ ఎవరు పెట్టారనే దానిపై స్పష్టత రాలేదు. దీంతో ఢిల్లీ పోలీసులు విచారణ చేపట్టారు.


నిషేధిత జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ నాయకుడు యాసిన్ మాలిక్ ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో ఉపా (యూఏపీఏ) చట్టం కింద జీవిత ఖైదును అనుభవిస్తున్నాడు. దేశంలో యూపీఏ ప్రభుత్వం ఉన్న సమయంలో యాసిన్ మాలిక్ ఢిల్లీలో మన్మోహన్ సింగ్ను కలిశారు. ఆ సమయంలో మన్మోహన్ సింగ్ ప్రధాన మంత్రిగా ఉన్నారు. తాజా పోస్టర్ ని చిత్రం ఈ సమావేశానికి సంబంధించినది. పోస్టర్ల వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీని తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news