కర్ణాటకలో ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఇక్కడ హసన్ సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఘోర ఓటమి పాలయ్యారు. ప్రజ్వల్‌పై కాంగ్రెస్ అభ్యర్థి శ్రేయాస్. ఎం పటేల్ ఘనవిజయం సాధించారు. ప్రజ్వల్ రేవణ్నపై ఇటీవలే లైంగిక దాడులు, వేధింపుల ఆరోపణల కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయన ఇటీవలే అరెస్టు కూడా అయ్యారు. ఈ అంశంపై ఆయన గెలుపుపై ప్రభావం చూపిందని అంతా భావిస్తున్నారు. మరోవైపు మాండ్యలో జేడీఎస్ నేత కుమారస్వామి జయకేతనం ఎగురవేశారు.
కర్ణాటకలో ఇటీవల ప్రజ్వల్ రేవణ్న సెక్స్ స్కాండిల్ దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. ప్రజ్వల్ మహిళలపై లైంగిక దాడులకు పాల్పడటం, లైంగిక వేధింపులకు పాల్పడటం వంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో కర్ణాటక సర్కార్ వెంటనే స్పందించి ఈ వ్యవహారంపై సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తునకు ఆదేశించింది. అయితే వీడియో బయటకు రాగానే ప్రజ్వల్ విదేశాలకు పరారయ్యారు. ఇటీవల మళ్లీ భారత్‌కు తిరిగివచ్చిన ఆయణ్ను పోలీసులు అరెస్టు చేశారు.