ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. మోదీ మహా ప్రభువు.. మహా అబద్ధాల కోరు అంటూ ఎద్దేవా చేశారు. కరవు పరిహారాన్ని విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడగకుండా, కర్ణాటక ప్రభుత్వం నేరుగా సుప్రీం కోర్టు ముందు కేంద్రం తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించడం విడ్డూరంగా ఉందని ప్రకాశ్ రాజ్ అన్నారు.
‘నేను జంగమను. జంగమను ప్రజలు అందరూ తాను చెప్పినట్లు వినాలని’ కొందరు నేతలు యోచిస్తుంటారని ప్రకాశ్ రాజ్ విమర్శించారు. ఈ వ్యాఖ్యలు, విమర్శలను ప్రజలు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తమకు కరవు పరిహారాన్ని విడుదల చేయాలని గత ఏడాది సెప్టెంబరు నుంచి కోరుతూ వస్తున్నా స్పందించకుండా, ఇప్పుడు కర్ణాటక నుంచి విన్నపమే రాలేదంటూ చెప్పడం దారుణమని వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మోదీపై ప్రకాశ్ రాజ్ తీవ్రంగా విరుచుకు పడ్డారు. కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి ప్రజల అభివృద్ధి, అవసరాలే పట్టవంటూ ధ్వజమెత్తారు.