వచ్చే నెల 10 నుంచి పార్లమెంట్ ప్రీ బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ ను రూపొందించడానికి అక్టోబర్ 10 నుంచి ప్రీ బడ్జెట్ సమావేశాలను కేంద్ర ఆర్థికశాఖ ప్రారంభించనుంది.
2023-24 సంవత్సరానికి సవరించిన అంచనాలను, 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అంచనాలను రూపొందించడానికి ఆర్థిక కార్యదర్శి అధ్యక్షతన వివిధ మంత్రిత్వ శాఖలతో సమావేశాలు జరపనుంది. ఇది ఇలా ఉండగా, పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టింది. ఈ బిల్లుపై ఇప్పటికే రాజ్యసభలో చర్చలు జరగ్గా.. తాజాగా లోక్‌సభలో వాడీవేడీ చర్చ సాగింది. చివరకు బుధవారం రోజున లోక్‌సభ మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపింది.
ఈ క్రమంలో ఇవాళ రాజ్యసభ ముందుకు మహిళా రిజర్వేషన్ బిల్లు రానుంది. 2010లో మహిళా రిజర్వేషన్ల బిల్లుకు రాజ్యసభ ఆమోదం లభించినా లోక్‌సభ పచ్చజెండా ఊపలేదు. దాదాపు 27ఏళ్లుగా ఇది పెండింగ్‌లోనే ఉంది. ఈసారి మహిళా రిజర్వేషన్లకు దాదాపు పార్టీలన్నీ మద్దతుగా నిలవడంతో ఈ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందింది. ఈ బిల్లును ఇవాళ రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు.