రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వచ్చే నెలలో విదేశాల్లో పర్యటించనున్నారు. ఈ టూర్లో ఆమె మూడు దేశాలను సందర్శించనున్నారు. ఆగస్టు 5వ తేదీ నుంచి ఆరు రోజుల పాటు ముర్ము విదేశాల్లో పర్యటించనున్నట్లు భారత విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. ఇందులో భాగంగా ఆమె ఫిజీ, న్యూజిలాండ్, తిమోర్ – లెస్తెలను సందర్శిస్తారని తెలిపింది.
5వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ద్రౌపదీ ముర్ము ఫిజీ దేశంలో పర్యటిస్తారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. భారత రాష్ట్రపతి ఆ దేశాన్ని సందర్శించడం ఇదే మొదటిసారని పేర్కొంది. ఈ సందర్భంగా ఆమె ఫిజీ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించనున్నట్లు తెలిపింది. అనంతరం భారత సంతతివారితో ముచ్చటిస్తారు. మరోవైపు ఆగస్టు 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ముర్ము.. న్యూజిలాండ్‌లో పర్యటించనున్నారు. అక్కడి గవర్నర్ జనరల్, ప్రధాన మంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. 10వ తేదీన ఆమె తిమోర్-లిస్తె చేరుకుంటారు. ఈ సందర్భంగా ముర్ము.. ఆ దేశాధ్యక్షుడు జోస్ రామోస్-హోర్తాతో భేటీ అవుతారు.