నిత్యం అధికారిక కార్యక్రమాల్లో బిజీగా ఉండే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కాసేపు సేద తీరారు. నిత్యం గంభీరంగా ఉండే ఆమె ఒక్కసారిగా చిన్నపిల్లలా మారి ఆటలు ఆడారు. ఏకంగా బ్యాడ్మింటన్ ప్లేయర్గా మారి కొద్దిసేపు షటిల్ రాకెట్ పట్టారు. కాసేపు బ్యాడ్మింటన్ ఆడి రిలాక్స్ అయ్యారు. అయితే ఆమె ఎవరితో బ్యాడ్మింటన్ ఆడారంటే?
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌తో కలిసి బ్యాడ్మింటన్ ఆడారు. రాష్ట్రపతి భవన్ ఈ అరుదైన సంఘటనకు వేదికగా మారింది. ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం ఆటలు ఆడాలంటూ చిన్నారులకు ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము సందేశం ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను రాష్ట్రపతి అధికారిక సోషల్ మీడియా అకౌంట్ ఇన్‌స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ప్రెసిడెంట్ ముర్ము తెల్లటి సల్వార్ – కుర్తా, స్పోర్ట్స్ షూ ధరించి కనిపించారు. వీరిద్దరు ఆడుతుండగా చుట్టూ అనేక మంది సిబ్బంది, ప్రేక్షకులు ఆటను వీక్షించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Well done, President ma’am 🙏🏻 pic.twitter.com/2Vo999wvNF
— Inder J Gusain (@OfficialInderJ) July 10, 2024