జమ్ముకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ప్రచారానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే మేనిఫెస్టో విడుదల చేసిన బీజేపీ ఎలాగైనా ఎన్నికల్లో గెలిచేందుకు పావులు కదుపుతోంది. ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకుండా పకడ్బంధీగా వ్యూహాలు రచిస్తోంది. జమ్ముకాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఆ రాష్ట్రం ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. టూరిజం చాలా డెవలప్ అయ్యింది. అక్కడి స్థానికులు, యువతకు ఉద్యోగ అవకాశాలు, వ్యాపార అవకాశాలు సైతం పెరిగాయి. దీనిని బీజేపీ తన ప్రచార అస్త్రంగా మార్చుకోవాలని చూస్తున్నది.
ఈ క్రమంలోనే ఈనెల 14న ప్రధాని మోడీ జమ్మూలో పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని సమాచారం. దీంతో ఏ అంశాలపై ప్రధాని మోడీ మాట్లాడుతారు? ఎటువంటి అంశాలను ప్రధానంగా ఎంచుకుంటారు? ప్రత్యర్థులను ఇరుకున పెట్టే వ్యాఖ్యలు చేస్తారా? అక్కడి యుువతను దృష్టిలో ఉంచుకుని ఉద్యోగాల కల్పనకు సంబంధించి మళ్లీ ఏదైనా మేజర్ ప్రకటన చేస్తారా? అని ఆసక్తి నెలకొంది. కాగా, మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గాను 3 దశల్లో (ఈనెల 18, 25, అక్టోబర్ 1)పోలీంగ్ జరగనుంది. కాగా, అక్టోబర్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి.