భారీ వర్షాలు వరదల వలన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 45 మంది మృతి చెందారు. అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 35మంది మృతి చెందారు. ఒకరు మిస్సింగ్ అయ్యారు. గుంటూరు జిల్లాలో ఏడుగురు మృతి చెందగా…. పల్నాడు జిల్లాలో ఒకరు,ఏలూరు జిల్లాల్లో ఒకరు మృతి చెందారు. వర్షాలు వల్ల 339 రైళ్లు రద్దు కాగా… 181 రైళ్లు దారి మళ్లింపులు చేశారు. 1,81,53870 హెక్టార్ల లో పంట , 19686 హెక్టార్లలో ఉద్యాన వన పంటలకు నష్టం జరిగింది. 2లక్షల35 వేల మంది రైతులు నష్టపోయారు.
71 వేల కోళ్లు, 478 పశువులు మృతి చెందాయి. 22 సబ్ స్టేషన్ లు, 3913 కిలోమీటర్ల మేర రహదారులు, అర్బన్ రోడ్స్ 558 కిలోమీటర్లు మేర వరదల వలన దెబ్బతిన్నాయి. 78 చెరువులకు, కాలువలకు గండ్లు పడ్డాయి. 6,44133 మంది వరదల వల్ల ప్రభావమయ్యారని అధికారులు చెబుతున్నారు. 246 రిలీప్ క్యాంపుల్లో 48,528 మంది ఆశ్రయం పొందుతున్నారని… వరద బాధితులను ఆదుకునేందుకు 50 ఎన్ డి ఆర్ ఎఫ్ ఎస్ డి ఆర్ ఎఫ్ టీంలు రంగంలో దిగాయన్నారు.