జనాభా నియంత్రణలో బీహార్ ముఖ్యమంత్రిని నితీష్ కుమార్ చేసిన వివాహ దాస్పద వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ఈ విషయంలో ప్రతిపక్షాల మౌనాన్ని ఆయన ప్రశ్నించారు. మధ్యప్రదేశ్ లోని గుణ నియోజకవర్గంలో ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా నితీష్ వ్యాఖ్యలు దేశానికే అవమానకరమని అన్నారు ప్రధాని. భారత కూటమికి చెందిన ప్రధాన నాయకుడు బీహార్ అసెంబ్లీలో మహిళలపై అసభ్య పదజాలం ప్రయోగించాడు. భారతకూటమిలోని ఏ నాయకుడు దీనికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇది వారికి ఏమాత్రం అవమానకరంగా కనిపించడం లేదు. మహిళల గురించి ఇలా ఆలోచించే వ్యక్తులు మీకు ఏం మంచి చేయగలరు అని ప్రశ్నించారు. మన అమ్మ అక్కచెల్లెళ్ల పట్ల ఇలాంటి దుర్మార్గపు వైఖరి ఉన్నవాళ్లు మన దేశానికి అవమానిస్తున్నారని ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంకా ఎంతకాలం దిగజారి పోతారని ఇండియా కూటమిని ఉద్దేశించి ప్రశ్నించారు ప్రధాని మోడీ. స్త్రీలు చదువుకుంటే భర్తలను కంట్రోల్ లో పెట్టి జనాభాను తగ్గిస్తారని జనాభా నియంత్రణపై మాట్లాడిన నితీష్ కుమార్ వ్యాఖ్యలు దుమారం రేపాయి. మహిళలు విద్యావంతులైతే కలయిక వేల భర్తలను అదుపులో పెడతారని తద్వారా జనాభా తగ్గుతుందని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వ్యాఖ్యానించారు. మహిళలు విద్యావంతుల అవుతున్నందు వల్లే ఒకప్పుడు 4.3 గా ఉన్న జననాల రేటు ప్రస్తుతం 2.9కి తగ్గిందని త్వరలోనే రెండుకు చేరుతుందని నితీష్ అసెంబ్లీలో పేర్కొన్నారు.