ప్రధాని నరేంద్ర మోడీ ఆగస్టు నెలలో చైనాలో పర్యటించబోతున్నట్టుగా సమాచారం అందుతోంది. అక్కడ జరిగే షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో నరేంద్ర మోడీ పాల్గొనే అవకాశాలు ఉన్నట్లుగా నేషనల్ మీడియాలో వార్తలు హార్ట్ టాపిక్ గా మారుతున్నాయి. గల్వాన్ లోయలో ఘర్షణ తర్వాత నరేంద్ర మోడీ ఇప్పటివరకు చైనాకు వెళ్లలేదు.

ఇటీవల రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడిన నేపథ్యంలో చైనా దేశంలో పర్యటించాలని నరేంద్ర మోడీ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయంపైన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.