స్థానిక ఎన్నికలకు ముందుగానే ప్రభుత్వం మరో హామీని నెరవేర్చనున్నట్లుగా సమాచారం అందుతుంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా 18 నుంచి 55 ఏళ్ల మహిళలకు నెలకు రూ. 2,500 ఆర్థిక సహాయాన్ని అందించే దిశగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఉన్నతాధికారులు సెర్ప్, మెప్మా నుంచి మహిళల వివరాలను తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

కాగా, తెల్ల రేషన్ కార్డులు కలిగిన మహిళలను మాత్రమే లబ్ధిదారులుగా ఎంపిక చేయనున్నారు. దీంతో మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మహాలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. త్వరలోనే ఈ పథకానికి సంబంధించి మరింత సమాచారం వెలువడనుంది. కాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందుబాటులోకి వచ్చిన తర్వాత అనేక రకాల సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నాడని కొంతమంది ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగా ముందడుగు వేస్తున్నారని అంటున్నారు.