తెలంగాణలో అవినీతి రహిత పాలన కావాలి : మోడీ

 పారదర్శక ప్రభుత్వాన్ని తెలంగాణలో అవినీతి రహిత పాలన కావాలి..  మభ్యపెట్టే ప్రభుత్వం కాదు.. పని చేసే ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు ప్రధాని. నాలుగేళ్ల కాలంలోనే ప్రజలు బీజేపీని బలోపేతం చేశారు. తెలంగాణ ప్రజలు బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. అబద్దాలు వాగ్దానాలు కాదు.. క్షేత్ర స్థాయిలో పనులు తెలంగాణకు కావాలన్నారు.  రాణి రుద్రమదేవి లాంటి వీరామణులు పుట్టిన గడ్డ తెలంగాణ అని గుర్తుచేశారు. మహిళల జీవితాన్ని మెరుగు పరిచేందుకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టామని తెలిపారు. 

పేదలకు గ్యాస్, ఇళ్లు ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు. తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడేందుకు బీజేపీ కట్టుబడి ఉందని తెలిపారు మోడీ. 2014 పూర్వం కాంగ్రెస్ హయాంలో కేవలం 3400 కోట్లు మాత్రమే ధాన్యాన్ని కొనుగోళ్లు చేస్తే.. బీజేపీ ప్రభుత్వం రైతుల సంక్షేమం రూ.27వేల కోట్లను ఖర్చు చేశామని తెలిపారు.  పదేళ్లలో 2,500 కిమీ వరకు నేషనల్ హైవేలను ఏర్పాటు చేశామని తెలిపారు.  ప్రతీ గ్రామం నుంచి పల్లె నుంచి పట్టణాలకు వచ్చేందుకు రోడ్లను నిర్మించామని తెలిపారు. ఢిల్లీలో ఓ సోదరుడు ఉన్నాడనే నమ్మకాన్ని తెలంగాణ ప్రజలు మరిచిపోకూడదన్నారు.