వినూత్న బ్యాగ్ తో పార్లమెంట్ కి ప్రియాంక గాంధీ..!

-

పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతుంది. సోమవారం వాయిదా పడిన ఉభయసభలు నేడు తిరిగి ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. అయితే సభ ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే లోక్ సభ, రాజ్యసభ వాయిదా పడ్డాయి.

అమెరికాలో అదానీపై వచ్చిన ఆరోపణల పై చర్చ జరపాలని ప్రతిపక్ష కాంగ్రెస్ పట్టుబడుతుంటే.. దేశ వ్యతిరేక కార్యకలాపాల ఆరోపణలు ఎదుర్కొంటున్న జార్జ్ సోరోస్ ఫౌండేషన్ తో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ సంబంధాల వ్యవహార పై చర్చ జరపాలని బిజెపి పట్టుబట్టింది. దీనిపై ప్రభుత్వ, ప్రతిపక్షాల ఆందోళనలు, పరస్పర ఆరోపణలు, విమర్శలతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి.

అయితే ఓ వినూత్న బ్యాగ్ తో పార్లమెంట్ వద్ద నిరసన తెలుపుతూ దర్శనమిచ్చారు ప్రియాంక గాంధీ. గౌతమ్ ఆదానీపై అమెరికాలో కేసు నమోదైన నేపథ్యంలో ఆయనపై జేపీసీ విచారణ చేపట్టాలంటూ పార్లమెంట్ బయట కాంగ్రెస్, విపక్ష ఎంపీలు నిరసన చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ, అదానీ చిత్రాలతో పాటు.. ” మోదీ – అదానీ భాయ్ భాయ్” నినాదం ముద్రించిన బ్యాగ్ తో పార్లమెంట్ కి ప్రియాంక గాంధీ వచ్చారు.

ప్రియాంక చేతిలోని బ్యాగ్ ని పరిశీలించిన రాహుల్ గాంధీ.. ఎంతో క్యూట్ గా ఉందని వ్యాఖ్యానించారు. ఇక ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. సభా కార్యక్రమాల్లో మేము పాల్గొనాలనుకుంటున్నామని.. కానీ ప్రభుత్వం చర్చను కోరుకోవడం లేదని అన్నారు. ఏదో ఒక కారణంతో సభా కార్యక్రమాలను వాయిదా వేస్తున్నారని అన్నారు ప్రియాంక గాంధీ.

Read more RELATED
Recommended to you

Latest news