రాజ్యసభకు పోటీ చేసే అభ్యర్దులను జాబితాలో తెలంగాణకు చెందిన బీసీ నేత ఆర్ కృష్ణయ్యకు బిజేపీ అవకాశం కల్పించింది.. గతంలో వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్న ఆయన.. ఇటీవలే ఆ పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.. ఈ క్రమంలో బిజేపీ ఆయనకు ఛాన్స్ ఇచ్చింది. దీనిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది..
ఒడిషా నుంచి సుజీత్ కుమార్, హర్యానా నుంచి రేఖా శర్మ, ఏపీ నుంచి కృష్ణయ్య ను బిజేపీ ఎంపిక చేసింది.. కృష్ణయ్య ఎంపిక వెనుక కమలం పార్టీ భారీ స్కెచ్చే ఉందన్న ప్రచారం జరుగుతోంది.. ఆర్ క్రిష్ణయ్య బీసీల కోసం దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు. అధికారంలో ఏ పార్టీ ఉన్నా.. ఆయన మాత్రం బీసీ హక్కుల కోసం పోరాటాలు చేస్తూ.. బీసీ నేతగా బలమైన ముద్ర వేసుకున్నారు.. అయితే 2014లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు..
తెలంగాణలో బీసీ సీఎంను చేస్తామని అప్పట్లో చంద్రబాబు ప్రచారం చెయ్యడంతో.. కృష్ణయ్య సీఎం అవుతారని అందరూ భావించారు.. కానీ తర్వాత జరిగి ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలు కావడంతో ఆయన అసెంబ్లీలో పెద్దగా యాక్టివ్ కాలేకపోయారు. 2022లో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కృష్ణయ్యను వైసీపీ అధినేత జగన్ రాజ్యసభకు పంపారు. గత ఎన్నికల సమయంలో వైసీపీ తరపున ప్రచారం చేసిన కృష్ణయ్య.. పార్టీ ఓడిపోవడంతో రాజ్యసభకు రాజీనామా చేశారు..
బీసీ హక్కుల కోసం పోరాటం చేస్తానని ప్రకటించిన కృష్ణయ్యను బిజేపీ తమవైపు తిప్పుకుందనే ప్రచారం జరుగుతోంది.. కృష్ణయ్య కు రాజ్యసభ ఇచ్చి.. తెలంగాణాలో పార్టీని మరింత బలోపేతం చేసుకోవచ్చన్న ఆలోచనలో కమలం పార్టీ ఉందట.. తెలంగాణలో బీసీ ఓటర్లు ఎక్కువగా ఉండటంతో.. ఈ ప్లాన్ చేసిందనే టాక్ వినిపిస్తోంది..
తాము బీసీలకు అండగా ఉంటామన్న మెసేజ్ ను పంపి.. వారిని అక్కున చేర్చుకునేందుకు కృష్ణయ్యకు ఈ అవకాశం ఇచ్చినట్లు పార్టీలో చర్చ నడుస్తోంది.. మొత్తంగా కృష్ణయ్యకు రాజ్యసభ ఇచ్చి.. తెలంగాణలో మరింత బలపడాలని బిజేపీ చూస్తోంది.. ఇది ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూడాలి..