దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో ఫుడ్ స్ట్రీట్స్.. తెలుగు రాష్ట్రాల్లో నాలుగు చొప్పున ఏర్పాటు

-

కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో ఫుడ్ స్ట్రీట్స్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పరిశుభ్రమైన, సురక్షితమైన ఆహారపు అలవాట్లు, విధానాలను ప్రోత్సహించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో 4, తెలంగాణలో 4 చొప్పున ఏర్పాటు కానున్నాయి.

ఒక్కో ఆహార వీధి ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు రూ.కోటి కేటాయిస్తుంది. కేంద్ర పట్టణాభివృద్ధిశాఖతో కలిసి ఈ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం పేర్కొంది. ఆహార వ్యాపారంలో ఉన్నవారికి పరిశుభ్రత గురించి చెప్పి తినుబండారాల ద్వారా వచ్చే రోగాలను తగ్గించి ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ఈ కార్యక్రమం లక్ష్యమని వెల్లడించింది.

ఈమేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌, పట్టణాభివృద్ధిశాఖ కార్యదర్శి మనోజ్‌ జోషీలు సంయుక్తంగా అన్ని రాష్ట్రాలకు లేఖలు రాశారు. స్థానికంగా ఉపాధి కల్పించడంతోపాటు.. పర్యాటక రంగాలకు, ఆర్థిక వ్యవస్థకు ఈ కార్యక్రమం ఊతమిస్తుందని లేఖలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని నేషనల్‌ హెల్త్‌మిషన్‌ ద్వారా కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ, భారత ఆహార ప్రమాణాల సంస్థ సహకారంతో ప్రారంభిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news