రేపు PSLV-C58 ప్రయోగం.. కౌంట్ డౌన్ షురూ

-

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వచ్చే ఏడాది చేపట్టనున్న ప్రయోగాలకు సిద్ధమైంది. ఈ ఏడాది కంటే ఎక్కువ ప్రయోగాలు చేయడానికి రెడీ అయింది. ఇందులో భాగంగానే కొత్త ఏడాది 2024 తొలి రోజే ఓ ప్రయోగం చేపట్టనుంది. జనవరి 1వ తేదీన పీఎస్‌ఎల్‌వీ-సి58 ప్రయోగం చేపట్టేందుకు సన్నాహాలు చేసింది. ఇందుకోసం ఇవాళ్టి నుంచి కౌంట్ డౌన్ షురూ చేసింది. సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ (శ్రీహరికోట)లో ఈరోజు ఉదయం 8.10 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. ఈ ప్రక్రియ 25 గంటలపాటు కొనసాగి సోమవారం ఉదయం 9.10 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సి58 వాహకనౌక షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది.

ఇది ఎక్స్‌పోశాట్‌ను కక్ష్యలోకి వదిలిపెట్టిన తర్వాత పీఎస్‌4 10 ఇతర పేలోడ్‌లను హోస్ట్‌ చేయనున్నట్లు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. పీఎస్‌ఎల్‌వీ వాహకనౌక మనదేశానికి చెందిన ఎక్స్‌-రే పొలారిమీటర్‌ ఉపగ్రహం(ఎక్స్‌పోశాట్‌)ను అంతరిక్షంలోకి మోసుకెళ్లనున్నట్లు చెప్పారు. ఎక్స్‌పోశాట్‌ భారతదేశం అంతరిక్ష ఆధారిత ఎక్స్‌-రే ఖగోళ శాస్త్రంలో సంచలనాత్మక పురోగతికి నాంది కానుందని వెల్లడించారు. ఈ ఉపగ్రహ జీవితకాలం అయిదేళ్లని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news