పుణె రాష్ డ్రైవింగ్ కేసులో మరో ట్విస్ట్

-

పుణెలో మైనర్ బాలుడు మద్యం మత్తులో కారు నడిపి ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజినీర్లను బలి తీసుకున్న ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో రోజుకో ట్విస్ట్ చోటుచేసుకుంటోంది. తాజాగా బాలుడి రక్త నమూనాను తారుమారు చేసి అతడిని కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు. మైనర్ను తప్పించేందుకు ప్రయత్నించిన ఇద్దరు వైద్యులను అరెస్ట్ చేశారు. బాలుడి రక్తంలో ఆల్కహాల్‌ ఉందా లేదా అని తొలుత పరీక్షలు జరిపినప్పుడు వైద్యులు ఈ నిర్వాకం వెలగబెట్టినట్లు సమాచారం.

ససూన్‌ ఆస్పత్రిలోని డాక్టర్‌ అజయ్‌ తావ్రే, డాక్టర్‌ శ్రీహరి హర్నార్‌ అనే వైద్యులు బాలుడి రక్తనమూనాలను తారుమారు చేసినట్లు గుర్తించామని పుణె క్రైం బ్రాంచ్‌ పోలీసులు తెలిపారు. ఫలితంగా తొలిసారి పరీక్షలు జరిపినప్పుడు మైనర్ రక్త నమునాను డస్ట్బిన్లో పడేసి, దాని స్థానంలో మరొకరి శాంపిల్ పెట్టడంతో మైనర్ రక్తంలో ఆల్కహాల్‌ లేదని నివేదికలు వచ్చాయి. బాలుడిని రక్షించేందుకు విశాల్‌ అగర్వాల్‌ కుటుంబం పలుకుబడిని ఉపయోగించి వైద్యులను కూడా కొన్నారన్న ఆరోపణలను ఈ ఉదంతం బలపరుస్తోందని పోలీసులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news