తెలంగాణ మొదటి సీఎం కేసీఆర్ త్వరగా కోలుకుని అసెంబ్లీలో అడుగుపెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. యశోదా ఆసుపత్రిలో మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ ను సీఎం రేవంత్ తో పాటు, మంత్రులు పరామర్శించారు.

పదిహేను నిమిషాల పాటు కేసీఆర్, కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు రేవంత్ రెడ్డి. అనంతరం మీడియాతో రేవంత్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ మొదటి సీఎం కేసీఆర్ త్వరగా కోలుకుని అసెంబ్లీలో అడుగుపెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. మాజీ సీఎం కేసీఆర్ సలహాలు కూడా మేం తీసుకుంటామని.. తెలంగాణ ప్రజల డిమాండ్లపై ఆయన ప్రశ్నించాలని కోరారు. త్వరగా కేసీఆర్ కోలుకోవాలని..పేర్కొన్నారు. మాజీ సీఎం కేసీఆర్ కు అన్ని రకాల సేవలు అందించాలని కూడా ఆదేశించినట్లు చెప్పారు రేవంత్ రెడ్డి.