న్యూ ఇయర్ వేళ భారత్‌కు పుతిన్‌ ప్రత్యేక సందేశం

-

భారత్, రష్యాల మధ్య మునుపెన్నడూ లేని విధంగా బంధం బలపడుతోంది. ఈ మధ్య తరచూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ప్రధాని మోదీని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఇటీవలే ఆయన మోదీని రష్యాకు కూడా ఆహ్వానించారు. ఇక తాజాగా పుతిన్ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు ప్రధాని మోదీకి నూతన సంవత్సరం సందర్భంగా ప్రత్యేక సందేశాన్ని పంపారు. న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలుపుతూ ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలు, ఈ ఏడాదిలో జరిగిన అభివృద్ధిని ఈ సందేశంలో ఆయన గుర్తు చేసుకున్నారు.

అంతర్జాతీయంగా క్లిష్ట పరిస్థితులు ఉన్నా మాస్కో- భారత్‌ మధ్య స్నేహపూర్వక సంబంధాలు కొనసాగుతున్నాయని పుతిన్ పేర్కొన్నారు. ఇరు దేశాల సహకారంతో వాణిజ్యం వృద్ధి చెందిందని తెలిపారు. వివిధ ప్రాంతాల్లో ఉమ్మడి ప్రాజెక్టులు విజయవంతంగా అమలయ్యాయని చెప్పుకొచ్చారు ఈ ఏడాది షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో), జీ20కి భారత్‌ నేతృత్వం వహించిన తీరుపై పుతిన్‌ ప్రశంసలు కురిపించారు. మరోవైపు రష్యా మిత్ర దేశాలకు కూడా పుతిన్‌ క్రిస్మస్‌, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Latest news