రాహుల్ ద్రవిడ్ కు బీసీసీఐ అదిరిపోయే ఆఫర్. హెడ్ కోచ్ పదవీకాలం ముగిసిన రాహుల్ ద్రవిడ్ ను మరికొన్ని రోజులు కొనసాగాలని బీసీసీఐ పెద్దలు కోరారు. దీనికి ద్రవిడ్ కన్ఫర్మేషన్ ఇవ్వనట్లు సమాచారం. ఒకవేళ అతడు ఓకే చెబితే డిసెంబర్ 10 నుంచి దక్షిణాఫ్రికాలో పర్యటించే భారత జట్టుకు కోచ్ గా వ్యవహరించనున్నారు.
అయితే కోచ్ గా వ్యవహరించేందుకు ద్రవిడ్ విముఖత చూపుతున్నారని సమాచారం. ఏదైనా ఐపీఎల్ జట్టుకు మెంటార్ గా వ్యవహరించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా, నిన్న ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జెట్ల మధ్య మూడవ టి20 మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ నేపథ్యంలో ఆస్ట్రేలియా చేతిలో ఐదు వికెట్ల తేడాతో టీమిండియా ఓటమిపాలైంది.
ఇందులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా జట్టు… నిర్మిత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 222 పరుగులు చేసింది. అయితే 223 పరుగుల భారీ లక్ష్యంతో… చేదనకు దిగిన ఆస్ట్రేలియా జట్టు మొదట తడబడింది. కానీ ఆ తర్వాత విజృంభించి ఆడింది. ఈ నేపథ్యంలోని నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 225 పరుగులు చేసి ఆస్ట్రేలియా విజయం సాధించింది.