ప్రధాని మోదీ ఉదాసీనత చూస్తుంటే బాధేస్తోంది : రాహుల్ గాంధీ

-

భారత రెజ్లింగ్‌ సమాఖ్యలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. అయితే ఈ పరిణామాలకు నిరసనగా పలువురు క్రీడాకారులు తాము పొందిన ప్రతిష్ఠాత్మక పురస్కారాలను కేంద్రానికి తిరిగి ఇచ్చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఖేల్‌రత్న, అర్జున అవార్డులను వెనక్కి ఇచ్చేసింది.

ఈ విషయంపై తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై రాహుల్‌ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. యావత్‌ దేశానికి సంరక్షకుడైన ప్రధాని నరేంద్ర మోదీ ఉదాసీనత చూస్తుంటే బాధ కలుగుతోందని అన్నారు. దేశంలో ప్రతి కూతురికీ ఆత్మాభిమానమే మొదటి ప్రాధాన్యం అన్న రాహుల్.. ఆ తర్వాతే ఏదైనా అవార్డు అని పేర్కొన్నారు. ఈ ధీర వనితల కన్నీళ్ల కంటే ‘బాహుబలి’గా ప్రకటించుకునే వారి నుంచి కలిగే రాజకీయ ప్రయోజనాలు ఎక్కువయ్యాయా? అని మోదీని ప్రశ్నించారు.రు. తన పతకాలను ప్రధాని మోదీకి అందజేసేందుకు (శనివారం) వినేశ్‌ ఫొగాట్‌ బయలుదేరిన వీడియోను ‘ఎక్స్‌’లో షేర్‌ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news