2024లో ఉత్తర కొరియా అధినేత కిమ్ లక్ష్యాలు ఇవే!

-

నవంబర్లో ఓ నిఘా ఉపగ్రహాన్ని ఉత్తర కొరియా తొలిసారి భూ కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఈ జోష్లోనే వచ్చే ఏడాది 2024లో మరిన్ని ప్రయోగాలకు సిద్ధమైనట్టు సమాచారం. ఉత్తర కొరియా అధ్యక్షుడు  కిమ్ జోంగ్ ఉన్ రానున్న ఏడాది మూడు నిఘా ఉపగ్రహాలను ప్రయోగించాలని యోచిస్తున్నట్లు తెలిసింది. కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ-కేసీఎన్ఏ పేర్కొనడాన్ని ఉటంకిస్తూ యోన్హాప్ వార్తా సంస్థ ఈ విషయాన్ని తెలిపింది.

ఐదు రోజుల పాటు జరిగిన సెంట్రల్ కమిటీ ప్లీనరీ సమావేశం శనివారం రోజున ముగిసింది. ఈ నేపథ్యంలోనే కిమ్ ఈ లక్ష్యాన్ని అధికారులకు నిర్దేశించారని సదరు వార్తా సంస్థ తన కథనంలో పేర్కొంది. గత నెలలో ఓ నిఘా ఉపగ్రహాన్ని తొలిసారిగా ఉత్తర కొరియా భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అంతకుముందు రెండు సార్లు నిఘా ఉపగ్రహాన్ని భూకక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు కిమ్‌ ప్రభుత్వం విఫలమైనా రష్యా సహకారంతో ప్రయోగాన్ని విజయవంతం చేసింది. మరోవైపు అమెరికా, దక్షిణ కొరియా సైనిక కార్యకలాపాలను గమనించడంతోపాటు అణ్వస్త్ర సామర్థ్యాలను మెరుగుపర్చుకునేందుకే ఉత్తర కొరియా ఈ రాకెట్‌ ప్రయోగాలు చేస్తోందని న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news