వయనాడ్‌లో రాహుల్‌గాంధీ ఆధిక్యం

-

దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ప్రముఖులు బరిలో ఉన్న స్థానాల్లో కౌంటింగ్ ఉత్కంఠగా సాగుతోంది. గత ఎన్నికల్లో రెండుచోట్ల పోటీ చేస్తే ఒకచోట గెలిచిన కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, ఈసారి కూడా రెండు స్థానాల్లో (కేరళలోని వయనాడ్, యూపీలోని రాయ్ బరేలీ) పోటీ చేశారు. ఈ నేపథ్యంలో వయనాడ్‌లో రాహుల్ గాంధీ ముందంజలో ఉన్నారు. మరోవైపు కేరళలోని తిరువనంతపురంలో కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌ ఆధిక్యంలో ఉన్నారు.

2019లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని తమ కంచుకోట అమేఠీలో కంగుతిన్న రాహుల్‌, ఈసారి మరో కంచుకోటైన రాయ్‌బరేలీ నుంచి తొలిసారి పోటీ చేశారు. ఇక్కడ రాహుల్‌ గెలుపుపై కాంగ్రెస్‌ పార్టీ ధీమాగా ఉంది. బీజేపీ తరఫున దినేశ్‌ ప్రతాప్‌ సింగ్ నిలిచారు. గత ఎన్నికల్లో గెలిచిన కేరళలోని వయనాడ్‌ స్థానం నుంచి కూడా మరోసారి రాహుల్‌ పోటీ చేశారు. ఇక్కడ సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజా సతీమణి అన్నీ రాజా, బీజేపీ తరఫున ఆ పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు కే సురేంద్రన్‌ రాహుల్‌కు ప్రత్యర్థులుగా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news