కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ ఉదయం రెజ్లర్లను కలిశారు. హరియాణాలోని ఝజ్జర్ జిల్లాకు చెందిన వీరేందర్ అఖాడాలో వారి సమావేశం జరిగింది. రాహుల్తో భేటీ అయిన వారిలో ప్రముఖ రెజ్లర్ బజరంగ్ పునియా కూడా ఉన్నారు. క్రీడాకారులను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు, ఆ తర్వాత ఎన్నికల వ్యవహారంతో భారత రెజ్లింగ్ సమాఖ్య చుట్టూ వివాదాలు ముసురుకొన్న తరుణంలో రాహుల్ క్రీడాకారులతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
భేటీ అనంతరం పునియా మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ తమ రెజ్లింగ్ రొటీన్‌ను చూసేందుకు వచ్చారని తెలిపారు. తమతో పాటు కసరత్తులు చేశారని, రెజ్లింగ్ కూడా చేశారని వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్ ట్విటర్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పునియాతో రాహుల్ రెజ్లింగ్ చేయడం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
మరోవైపు ఇటీవల జరిగిన రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు, బీజేపీఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ విజయం సాధించడం రెజ్లర్లను తీవ్ర నిరాశకు గురిచేసింది. సంజయ్ ఎన్నికపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఇప్పటికే సాక్షి మలిక్ రిటైర్మెంట్ ప్రకటించగా.. బజ్‌రంగ్ పునియా, వీరేందర్ యాదవ్ పద్మశ్రీ అవార్డులను వాపస్ చేశారు. ఖేల్‌రత్న, అర్జున అవార్డులను వెనక్కి ఇచ్చేస్తున్నట్లు వినేశ్ ఫొగాట్ ప్రకటించారు.
जननायक @RahulGandhi जी आज हरियाणा में पहलवानों के बीच पहुंचे। pic.twitter.com/O3QqZFO2lA
— Congress (@INCIndia) December 27, 2023