అది సాధ్యమవుతుందని ఊహించలేదు.. లోక్​సభ సభ్యత్వం రద్దుపై రాహుల్ గాంధీ

-

అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన లోక్​సభ సభ్యత్వం రద్దుపై మాట్లాడారు. రాజకీయాల్లోకి వచ్చిన కొత్తల్లో లోక్‌సభ సభ్యత్వం రద్దును తాను ఊహించలేదని అన్నారు. అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సమయంలో.. వేటిని ఎదుర్కోవాల్సి వస్తుందో అస్సలు ఊహించలేదు. అసలు ఇలా జరుగుతుందని (లోక్‌సభ సభ్యత్వం రద్దు) అసలు అనుకోలేదు. కానీ, ఆ తర్వాత దీనిని నాకు లభించిన పెద్ద అవకాశంగా భావించా. నాకు లభించిన వాటిల్లో ఇదే పెద్ద అవకాశం. రాజకీయాలంటే అలానే ఉంటాయి’’ అని అన్నారు.

‘‘భారత్ జోడో యాత్ర కథ ఆరు నెలల క్రితం మొదలైంది. అప్పట్లో మేం ఇబ్బందులు పడుతున్నాం. ప్రతిపక్షాలన్నీ చిక్కుల్లో ఉన్నాయి. అధికార పక్ష ఆర్థిక ఆధిపత్యం, సంస్థాగత పెత్తనం నడుస్తున్నాయి. మా దేశంలోనే మేం ప్రజాస్వామ్య పోరాటం చేయడానికి అవస్థలు పడుతున్నాం. ఆ సమయంలో భారత్‌ జోడో యాత్ర చేయాలని నిర్ణయించుకున్నాను’’ అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news