కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేడు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే… ఉదయం 11 గంటలకు ఏఐసిసి ప్రధాన కార్యాలయం నుంచి బస్సులలో బయల్దేరి “రాంలీలా మైదాన్” కు చేరుకోనున్న ఏఐసిసి జనరల్ సెక్రటరీలు, సెక్రటరీలు, పిసిసి అధ్యక్షులు, సి.ఎల్.పి నాయకులు, పిసిసి మాజీ అధ్యక్షులు, ఎమ్.పిలు, పార్టీ అగ్రనేతలు… ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు రాంలీలా మైదాన్ లోని సభాస్థలికి చేరుకోనున్నారు రాహుల్ గాంధీ.
ఇక మధ్యాహ్నం 12.30 గంటలకు భారీ సంఖ్యలో హాజరయ్యే కాంగ్రెస్ కార్యకర్తలు, పిసిసి సభ్యులనుద్దేశించి ప్రసంగించనున్నారు రాహుల్ గాంధీ. ఆగస్టు 17 నుంచి 23 వరకు వరుసగా దేశంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ “మెహంగాయ్ చౌపాల్” నిరసన ప్రదర్శనలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ…దీనికి ముగింపుగా నేడు ఢిల్లీలో భారీ నిరసన ర్యాలీ నిర్వహిస్తోంది.
దేశంలో అంతకంతకూ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు వ్యతిరేకంగా ఈ రోజు రాంలీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న భారీ ర్యాలీ కి ఢిల్లీ తో సహా, దేశ రాజధానికి చుట్టుపక్కలనున్న హర్యానా, ఉత్తర్ ప్రదేశ్ లాంటి పలు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్య లో హాజరుకానున్నారు పార్టీ కార్యకర్తలు.
బాధ్యత గల ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ పెరిగిన ధరలు తగ్గేవరకు, వీధుల్లో ప్రజాపోరాటాలు కొనసాగిస్తుందని ప్రకటన చేయనున్నారు.