ముంబైలో వర్షం బీభత్సం.. ఓపెన్ డ్రైన్ లో పడి మహిళా మృతి

-

ముంబైలో వర్షం బీభత్సం సృష్టిస్తుంది. భారీ వర్షాలతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు అంధేరిలో మ్యాన్ హోల్లో పడి ఓ మహిళ మరణించింది. ఆ మహిళను 45 ఏళ్ల విమల్ గైక్వాడ్ గా గుర్తించారు. ప్రమాద ఘటన పై ముంబై పోలీసులు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్టర్ పై కేసు నమోదు చేశారు. అర్థరాత్రి జరిగిన ఈ ఘటన పై విచారణకు కూడా బీఎంసీ ఆదేశించింది. 

నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. మహిళా భర్త ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. భారీ వర్షం సమయంలో అంధేరీ ఈస్ట్ లోని మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ భవనంలోని గేట్ నెంబర్ 08 సమీపంలోని పొంగిపొర్లుతున్న మ్యాన్ మోల్ మహిళ పడిపోయింది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఆమెను గుర్తించి కూపర్ ఆసుపత్రికి తరలించారు. ఆ మహిళ మరణించినట్టు వైద్యులు నిర్థారించారు. భారీ వర్షాల కారణంగా దేశ ఆర్థిక రాజదాని ముంబైలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. రైల్వే ట్రాక్ లు, రోడ్లు నీటిలో మునిగాయి. మరో రెండు రోజుల పాటు వర్షాలు పడతాయని రెడ్ అలెర్ట్ జారీ చేశారు అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news