వాహన దారులకు బిగ్ అలర్ట్. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్కు రూ.2 చొప్పున తగ్గించింది. కొత్త ధరలు శుక్రవారం ఇవాళ్ ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి రానున్నట్లు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి సోషల్ మీడియాలో వెల్లడించారు. దీంతో వాహనదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు రాజస్థాన్ సర్కార్ పెట్రోల్, డీజిల్‌పై 2 శాతం వ్యాట్ తగ్గించింది. దేశ వ్యాప్తంగా తగ్గిన ఇవాళ ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి రానున్నాయి.అయితే దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం పై కొంత మంది విమర్శలు కూడా చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించారని… పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్కు రూ.2 చొప్పున మాత్రమే తగ్గించారని ఫైర్ అవుతున్నారు. ఒక 10 రూపాయలు తగ్గిస్తే బాగుండు అంటున్నారు.