Yadadri : యాదాద్రిలో భట్టి విక్రమార్క, కొండా సురేఖను సీఎం రేవంత్ రెడ్డి అవమానించిన సంగతి తెలిసిందే. 4 రోజుల కిందట ఇతర మంత్రులు. యాదాద్రిలో సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర మంత్రులు పర్యటించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క, కొండా సురేఖను కింద కూర్చోబెట్టారు మంత్రులు, సీఎం రేవంత్ రెడ్డి.దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
దీంతో భట్టి విక్రమార్క, కొండా సురేఖను దారుణంగా అవమానించారని..రెడ్డి అహంకారంతో…సీఎం రేవంత్ రెడ్డి ఇలా చేస్తున్నాడని ఫైర్ అవుతున్నారు. కాగా, ఈ సంఘటనలో యాదగిరిగుట్ట ఆలయ ఇంచార్జ్ ఈఓ రామకృష్ణ రావు బలయ్యాడు.ప్రోటోకాల్ విషయంలో నిర్లక్ష్యం చేసినందుకు గాను యాదగిరిగుట్ట ఆలయ ఇంచార్జ్ ఈఓ రామకృష్ణ రావు పై బదిలీ వేటు వేశారు. ఇటీవల డిప్యూటీ సీఎం బట్టి, మహిళా మంత్రి కొండా సురేఖకు చిన్న పీటలు వేయడంపై వివాదం తలెత్తింది. దింతో ఈ ఘటనలో ఈవోను బాద్యున్ని చేస్తూ చర్యలు తీసుకున్నారు. ఇక నూతన ఈవోగా అడిషనల్ కలెక్టర్ భాస్కరరావు…బాధ్యతలు చేపట్టారు.