IPL 2023 : ధోని సేన స్పీడ్ కు బ్రేకులు వేసింది రాజస్థాన్ జట్టు. ఐపీఎల్ 16వ సీజన్ లో సీఎస్కే వరుస విజయాలకు బ్రేక్ పడింది. గురువారం సీఎస్కే తో మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 32 పరుగుల తేడాతో విజయం సాధించింది. 203 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేయగలిగింది. ఇక ఈ మ్యాచ్ ఓటమిపై ధోని స్పందించారు.
“ఈ పిచ్ పై ఇంత టార్గెట్ కొంచెం కష్టతరమై. అయితే తొలి ఆరు ఓవర్లలో మా బౌలర్లు ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నారు. ఆ తర్వాత మిడిల్ ఓవర్లలో బౌలర్లు మంచి ప్రదర్శన చేసినప్పటికీ కొన్ని మిస్ ఫీల్డ్ ల వల్ల పరుగులు వచ్చాయి. ఇక పతిరన బౌలింగ్ బాగానే ఉంది. పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉన్నప్పుడు ఎంతటి బౌలర్ అయిన ఏం చేయలేడు. ఇక రాజస్థాన్ బ్యాటింగ్ అద్భుతంగా ఆడింది. ముఖ్యంగా యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్ లాంటి కుర్రాళ్ళు అద్భుతంగా ఆడారు. కానీ గెలుపు ఒక్కరికే దక్కుతుంది. ఈరోజు రాజస్థాన్ దే” అని చెప్పుకొచ్చాడు.