ప్రతిపక్షాల నోటీస్ ను తిరస్కరించిన రాజ్యసభ చైర్మన్

-

కన్వర్ యాత్ర మార్గంలో హోటళ్లపై యజమానుల పేర్లు రాయాలంటూ ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు నిబంధనలు తీసుకొచ్చాయి. ఈ నిబంధనను విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. దీనిపై చర్చ జరపాలంటూ రాజ్యసభలో  ప్రతిపక్ష ఎంపీలు ఇచ్చిన నోటీసులను ఛైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ తిరస్కరించారు. పార్లమెంటరీ విధానంలోని రూల్ 267 ప్రకారం.. నోటీసులు దాఖలు చేశారన్నారు. ఇది అత్యవసర, తక్షణ చర్చ కోసం నోటీసు అని పేర్కొన్నారు. అందుకే, వాటికి ప్రాధాన్యతనిచ్చేలా ఇతర చర్చలను తాత్కాలికంగా నిలిపివేయాలని కోరుతుందని గుర్తుచేశారు.

ప్రతిపక్షాలు ఇచ్చిన నోటీసులు నిబంధనలకు అనుగుణంగా లేవని గుర్తించి వాటిని కొట్టివేశారు. సభ సజావుగా సాగేందుకు ప్రయోజనం చేకూర్చే ఆదేశాలు ఇవ్వడం ఛైర్మన్ అధికారమని అన్నారు. సభ్యులు దానికి కట్టుబడి ఉండాలని బదులిచ్చారు. దీనికి సంబంధించిన వివరణాత్మక ఆదేశాలు జారీ చేస్తామని, అవసరమైతే సభ్యులు సమస్యలను లేవనెత్తవచ్చని పేర్కొన్నారు. “నేను ఈ నోటీసులను పరిగణనలోకి తీసుకోలేను. ఇది చాలా కాలంగా కొనసాగుతున్న సంప్రదాయం” అని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news