Success Story : CA పాసయ్యిన టీ అమ్మే వ్యక్తి కూతురు! ఎందరికో ఆదర్శం!

-

చదువు.. పేదవాడి ఆయుధం. చదువు పేదవాడి కోటాను కోట్ల ఆస్తి. చదువు.. పేదవాడి తల రాతని మార్చే దేవత. అలా నిరు పేదరికంలో పుట్టి చదువుని ఆయుధంగా మార్చుకొని చరిత్రలో నిలిచిన వారు ఎందరో ఉన్నారు. బిఆర్ అంబేద్కర్, అబ్దుల్ కలాం పేద కుటుంబంలో పుట్టి బాగా చదువుకొని మహానుభావులు అయ్యారు. కోటాను కోట్ల పేద వాళ్లకి ఆదర్శంగా నిలిచారు.

తాజాగా ఓ టీ అమ్మే వ్యక్తి కుమార్తె కష్టపడి చదివి దాదాపు 10 ఏళ్ల తరువాత సీఏ పాస్ అయ్యింది. ఈ క్రమంలో ఆమె తండ్రీని పట్టుకుని ఏడ్చేసింది.ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే…అత్యంత కష్టమైన పరీక్షల్లో ఒకటైన చార్టర్డ్ అకౌంటెంట్(సీఏ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా మంది కొన్ని సార్లు మాత్రమే ప్రయత్నం చేసి విఫలమైతే విసుగు చెంది విడిచిపెడుతుంటారు. అలానే మరికొంతమంది నాలుగైదేళ్లు ప్రిపేర్ అయ్యి.. విఫలమయితే వదిలేస్తుంటారు.కానీ ఓ యువతి మాత్రం విఫలమయిన పట్టువదలకుండా..ఎన్ని అవమానాలు ఎదురైనా కానీ తన తండ్రి తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఏకంగా 10 ఏళ్ల పాటు కృషి చేసి చివరకు విజయం సాధించింది.

ఢిల్లీకి చెందిన అమితా ప్రజాపతి పదేళ్ల తరువాత కష్టమైన సీఎ పాసైంది.ఆ తరువాత తండ్రిపై పడి భావోద్వేగాన్ని పంచుకున్నా వీడియోను ఆమె షేర్ చేశారు. దీనికి ఇప్పుడు లక్షల్లో లైక్స్, వేలల్లో కామెంట్స్ వస్తున్నాయి. బంధువులు ఎన్ని మాటలన్నా కూడా తన తండ్రి పట్టించుకోకుండా, ఆర్థిక సమస్యలను తట్టుకొని తనను చదివించి సీఏ చేశారని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక అమితా తండ్రి ఓ ఛాయ్ దుకాణం నడుపుతూ ఉంటారు. ఆ షాపు మీద వచ్చిన సంపాదనతో వారు తమ జీవనం సాగించే వారు. వాళ్ల ఇళ్లు కూడా మురికి వాడలో ఉండేది. వారికి ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ.. అమితా తండ్రి మాత్రం..ఆమెను సీఎ చదివిచడం ఏమాత్రం మానలేదు.

ఆమె చాలా సార్లు సీఏ పరీక్షల్లో విఫలమవుతున్నా కానీ ఆమెను ప్రోత్సహిస్తూ.. ఆమెకు ధైర్యాన్నిచ్చే వాడు.సీఎ పరీక్షల్లో విఫలమవుతుండటంతో బంధువులు, తోటి వారు ఆమెను హేళన చేసేవారు.అప్పుడు అమితా తండ్రి..ఆమెకు ధైర్యాన్ని ఇచ్చేవాడు. అలా తండ్రి పోత్సాహంతో పట్టు వదలకుండా ఆమె 10 ఏళ్ల పాటు చదివింది. చివరకు పదేళ్ల తరువాత సీఏ పాసై మొత్తానికి తాను అనుకున్నది సాధించింది.

Read more RELATED
Recommended to you

Latest news