సమాజ్‌వాదీ పార్టీ మాజీ నాయకుడు రాజ్యసభ ఎంపీ అమర్ సింగ్ సింగపూర్‌లో కన్నుమూశారు. ఆయనకు భార్య పంకజతోపాటు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. గత ఆరు నెలలుగా చికిత్స సింగపూర్‌లోని ఓ ఆసుపత్రిలో పొందుతున్న అమర్‌సింగ్ 64 పరిస్థితి విషమించడంతో మరిణించినట్లు తెలుస్తుంది. గతంలో ఆయన కిడ్నీ మార్పిడి చేయించుకున్నారు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు, అమర్‌సింగ్ ఇటీవలి రెండో కిడ్నీ మార్పిడి చేయించుకున్నారని, మార్పిడి ప్రక్రియ కూడా విజయవంతమైందని తెలుస్తుంది. కానీ ఆయన పొట్టలో ఉన్న కణతి రోజు రోజుకి పెరగటం మూలంగా తుది శ్వాస విడిచారని సమాచారం.
కాగా ఈరోజు ఉదయం స్వాతంత్ర్య సమరయోధుడు బాల్ గంగాధర్ తిలక్‌కు నివాళి అర్పించారు. అలాగే బక్రీద్ శుభాకాంక్షలు కూడా తెలిపారు. గత ఆరు నెలల నుండి చికిత్సపొందుతున్న అమర్‌సింగ్ సోషల్‌మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉన్నారు. ఆయన మార్చి 22న హాస్పిటల్ బెడ్ నుండి ట్విట్టర్లో వీడియో పోస్ట్ చేస్తూ కరోనాపై జరుతున్న పోరాటంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మద్దతు ఇవ్వాలని తన అనుచరులందరికీ విజ్ఞప్తి చేశారు.
గతంలో అమర్‌సింగ్ మరణించారంటూ వచ్చిన వార్తలను ఖండిస్తూ మార్చి 2 న ఆయన మరో వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు. “టైగర్ జిందా హై,” అంటూ తనకేమీ కాలేదని ఆరోగ్యంగా ఉన్నట్లు వీడియో సందేశాన్ని ట్వీట్ చేశారు.
1956 జనవరి 27న ఉత్తర్ ప్రదేశ్‌లో జన్మిచిన అమర్‌సింగ్. సమాజ్‌వాదీ పార్టీలో క్రియాశీలక పాత్రను పోషించారు. 1996, 2002, 2008, 2016 సంవత్సరాల్లో రాజ్యసభకు ఎంపికయ్యారు. 2010లో ములాయంసింగ్‌తో ఉన్నవిబేధాల కారణంగా పార్టీని వీడి, 2011లో అమర్ సింగ్ సొంత రాజకీయ పార్టీ రాష్ట్రీయ లోక్ మంచ్ ను నెలకొల్పారు.2012లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 403 యోజకవర్గాలకు గాను 360 చోట్ల తన పార్టీ అభ్యర్థులను నిలపగా సీటు కూడా రాలేదు.
Congratulations to all the Indians led by our PM @narendramodi ji to help support the fight against #COVID19. #JanataCurfew #SelfIsolation #Covid_19india #JantaCurfewMarch22 pic.twitter.com/6A3aGUbWKx
— Amar Singh (@AmarSinghTweets) March 22, 2020
I humbly request to all my brothers, sisters & elders to follow our PM @narendramodi ji. #Janata_Curfew #CoronavirusPandemic #coronavirusindia pic.twitter.com/nE0f2RnS3C
— Amar Singh (@AmarSinghTweets) March 21, 2020
Tribute to the great revolutionary freedom fighter Lokmanya #BalGangadharTilak ji on his death anniversary.
His contribution will be remembered forever🙏🙏 pic.twitter.com/tEdchlp1hz— Amar Singh (@AmarSinghTweets) August 1, 2020
Wishing a very joyous Eid Al Adha. Let's celebrate this day by spreading love and happiness. #EidMubarak #EidAladha2020
— Amar Singh (@AmarSinghTweets) August 1, 2020