భారత్ చేరుకున్న రాఫెల్ యుద్ద విమానాలు, ప్రత్యేకతలు ఇవే…!

-

రాఫెల్ యుద్ద విమానాలు భారత్ చేరుకున్నాయి. అంబాలా ఎయిర్ బేస్ కి రాఫెల్ విమానాలు చేరుకున్నాయి. ఫ్రాన్స్ నుంచి 7 వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి భారత్ చేరుకున్నాయి. రాఫెల్ చేరికతో… భారత వాయు సేన మరింత పటిష్టం అయింది. 50 వేల అడుగుల ఎత్తులో కూడా అవి ఎగరగలవు. అణ్వాయుధాలను మోసుకుని వెళ్ళే సత్తా వాటి సొంతం. విజువల్ రేంజ్ ని దాటి అవి డీ కొడతాయి అని భారత వాయిసేన పేర్కొంది.

5 విమానాలు చేరుకోగా అందులో రెండు… శిక్షణ విమానాలు. 3 యుద్ద విమానాలు. తొలి విడతగా 5 వచ్చాయి. రాఫెల్ కి రక్షణ గా రెండు సుఖోయ్ యుద్ద విమానాలు వచ్చాయి. గంటకు 1912 కిలోమీటర్ల స్పీడ్ తో అవి దూసుకుని వెళ్తాయి. 9 వేల 500 కేజీల ఆయుధాలను అవి మోసుకుని వెళ్తాయి అని వాయుసేన పేర్కొంది. ఒక్కో యుద్ద విమానం పొడవు 15.30 మీటర్లు.

రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ రఫెల్‌ విమానాలు అంబాలా ఎయిర్‌ బేస్‌కి చేరుకున్నాయని, రాఫెల్‌ యుద్ధ విమానాలు భారత సైనిక చరిత్రలో కొత్త శకానికి నాంది అంటూ ట్వీట్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news