భారత ప్రముఖ వ్యాపారవేత్త, టాటా ఇండస్ట్రీస్ అధినేత రతన్ టాటా బుధవారం రాత్రి 11.30 గంటలకు తుది శ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సంతాప దినంగా ప్రకటించింది. రతన్ టాటా అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. ప్రభుత్వం తరుపున అంత్యక్రియలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు. ప్రధానంగా ముంబయి లోని NPCA గ్రౌండ్ లో రతన్ టాటాకు పలువురు రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు హాజరై సంతాపం ప్రకటించారు. NPCA గ్రౌండ్ నుంచి వర్లీ శ్మశాన వాటిక వరకు సాయంత్రం అంతిమ యాత్ర కొనసాగింది. మహారాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించడంతో.. గాలిలోకి తుపాకులు పేల్చి గౌరవ వందనం సమర్పించారు పోలీసులు. తాజాగా రతన్ టాటా అంత్యక్రియలు ముగిశాయి.
పార్సీ సంప్రదాయం ప్రకారం నిర్వహించారు. జొరాస్ట్రియన్లు దేహాన్ని ప్రకృతి పరంగా భావిస్తారు. గాలి, నీరు, నిప్పు కలుషితం కాకుండా తిరిగి ప్రకృతికే సమర్పిస్తారు. గద్దలు, రాబందులకు ఆహారంగా ఉంచుతారు. ప్రస్తుతం పార్సీలు ఎక్కువగా పర్యావరణ హితం కోసం ఎలక్ట్రిక్ క్రిమెటోరియంలను ఆశ్రయిస్తున్నారు. రతన్ టాటా అంత్యక్రియలు కూడా అలాగే జరిగాయి. రతన్ టాటా కోసం తన పెంపుడు కుక్క గోవా దీనం ఎదురుచూస్తోంది. పోలీసులు దానిని టాటా భౌతిక కాయం వద్దకు తీసుకెల్లి చూపించారు. గోవా అనే పెట్ డాగ్ అంటే టాటాకు ఎంతో ఇష్టం. అది గోవాలో దొరికింది అందుకే దానికి ఆ పేరు పెట్టారు. గోవాతోనే టాటా ఎక్కువగా గడిపేందుకు ఇష్టపడేవారట.