పల్లిలు అమ్ముకునే ఒక వ్యక్తి.. ఒక పాటతో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు.. అతనే భూబన్. కచ్చా బాదామ్ అనే పాటతో భూబన్ ప్రపంచ వ్యాప్తంగా ఫుల్ క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. గల్లిల్లో పాడిన పాట నేడు ప్రపంచ వ్యాప్తంగా అన్ని నగరాల్లో వినిపిస్తోంది. దీంతో అతని జీవితం రూపు రేఖలు మారిపోయాయి. ఒక పెద్ద సెలబ్రెటీ అయిపోయాడు. అయితే ఈ కచ్చా బాదామ్ సింగర్ భూబన్ కు ప్రమాదం జరిగింది. కారు ప్రమాదంలో భూబన్ ఛాతిలో బలమైన గాయం అయింది.
దీంతో భూబన్ ను కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్చారు. అయితే భూబన్ పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారు. కాగ భూబన్ కు స్టార్ డమ్ రావడంతో సెకండ్ హాండ్ లో ఒక కారు తీసుకున్నాడు. అయితే భూబన్ కు డ్రైవింగ్ రాకపోవడం నేర్చుకుంటున్నాడు. అలాగే సోమ వారం కూడా కారు డ్రైవింగ్ నేర్చుకుంటున్న సందర్భంలో అతని కారుకు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ప్రస్తుతం భూబన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. కాగ భూబన్.. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి.