ముంబైలో కాలుష్యం పట్ల టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తు తరాలకు ఈ పరిస్థితి సరైనది కాదని పేర్కొన్నారు. ‘మన ముందు తరాలు ఎటువంటి భయం లేకుండా జీవించడం ముఖ్యం. నేను క్రికెటేతర విషయాలు ఎప్పుడు మాట్లాడిన ముందుగా ఈ అంశాన్నే ప్రస్తావిస్తాను. వాతావరణంపై మనం జాగ్రత్తలు తీసుకోవాలి’ అని రోహిత్ స్పష్టం చేశారు. ముంబైలో కాలుష్యంపై బాంబే హైకోర్టు సైతం ఇటీవల ఆందోళన వ్యక్తం చేసింది.
కాగా.. నేడు ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇండియా, శ్రీలంక మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కెప్టెన్ రోహిత్ శర్మ కెరీర్ లోనే చాలా స్పెషల్. హిట్ మ్యాన్ ఈ వాంఖడే స్టేడియంలో ఎక్కువగా మ్యాచ్లు ఆడుతూ పెరిగారు. దాదాపు 12 ఏళ్ల క్రితం 2011లో ఈ స్టేడియంలోనే భారత్, శ్రీలంక WC ఫైనల్ ఆడాయి. ఈ WCలో రోహిత్ కి చోటు దక్కలేదు. అప్పుడు రోహిత్ ఎంతో బాధపడ్డారు. ఇప్పుడు అదే శ్రీలంక పై గెలిచి సెమీస్ కి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.