పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లోనూ ఇండియా ఏకంగా 7 వికెట్ల తేడాతో విజయం సాధించి వరల్డ్ కప్ లో హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకుంది. పాకిస్తాన్ ఇచ్చిన 192 పరుగుల లక్ష్యాన్ని కేవలం 30 .3 ఓవర్లలోనే మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించి న్యూజిలాండ్ కన్నా అధిక రన్ రేట్ ను సాధించి పాయింట్ల పట్టికలో మొదటి స్థానాన్ని చేజిక్కించుకుంది.
అయితే.. PAKతో హై వోల్టేజ్ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దుమ్మురేపాడు. పెసర్ షాహిన్ ఆఫ్రిది బౌలింగ్ లో తన ట్రేడ్ మార్క్ పుల్ షాట్ కు అంపైర్ ఎరాస్మస్ ఆశ్చర్యపోయారు. అలా ఎలా కొడుతున్నావని అడగ్గా…. రోహిత్ నవ్వుతూ బైసెప్స్(కండలు) చూపించాడు. మ్యాచ్ తర్వాత రోహిత్ దీనిపై స్పందించాడు. ‘అంత ఈజీగా ఎలా సిక్సర్ కొట్టావని ఎంపైర్ అడిగాడు. బ్యాట్ పవరా అని అంటే…. కాదు నా పవర్ అని చెప్పా’ అని రోహిత్ తెలిపాడు.