జీ20 విదేశాంగ మంత్రుల సమావేశం వేళ రష్యా ఘాటు వ్యాఖ్యలు

-

జీ20 అధ్యక్ష హోదాలో ఉన్న భారత్‌  విదేశాంగ మంత్రుల సమావేశానికి ఆతిథ్యం ఇస్తోంది. ఇవాళ, రేపు దిల్లీ వేదికగా ఈ సమావేశాలు జరుగుతున్నాయి. క్రెయిన్‌ సంక్షోభం, చైనా బెలూన్‌ ఘటనలు ఈ సమావేశ ఉద్దేశాన్ని మరుగునపడేలా చేస్తాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పేదరిక నిర్మూలన, ఆహార, ఇంధన భద్రత, ఉగ్రవాదంపై పోరు వంటి  అంశాలపై దృష్టి పెట్టాలని మన దేశం భావిస్తోంది. కానీ ఉక్రెయిన్‌ అంశమే ఆధిపత్యం చెలాయించేలా కనిపిస్తోంది.

ఇప్పటికే రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ భారత్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో రష్యా విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘ రష్యాపై ప్రతీకారం తీర్చుకోవాలని పాశ్చాత్య దేశాలు ఈ వేదికను ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. యూఎస్‌, దాని మిత్రదేశాల విధ్వంసక విధానాల వల్ల ఈ ప్రపంచం ఇప్పటికే విపత్తు అంచున ఉంచింది. వాటి తీరు సామాజిక-ఆర్థికాభివృద్ధిని వెనక్కి నెట్టింది. పేద దేశాల కష్టాలను మరింత తీవ్రం చేసింది’ అంటూ ఆ ప్రకటనలో పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version