ఇద్దరూ మహిళా అధికారులు కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఆపరేషన్ సిందూర్ అమలు చేసిన విధానం పై మీడియా కి వివరించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ అధికారులపై చర్చ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ సిందూర్ పై భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా స్పందించారు. ఈ మేరకు తాజాగా ఇన్ స్టాగ్రామ్ వేదిక గా ఒక స్టోరీ పోస్ట్ చేశారు.
కల్నల్ సోఫియా, వింగ్ కమాండర్ వ్యోమిక చేసిన బ్రీఫింగ్ కి ప్రతి స్పందన గా ఈ దేశ ఐక్యతకు సరైన నిదర్శనం అంటూ ఫోటోలను పంచుకున్నారు. ఈ శక్తివంతమైన ఫోటో.. మనమంతా ఒక్కటే జాతి అనేందుకు నిలువెత్తు నిదర్శనంలా నిలిచింది అని సానియా పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.