ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బండారు రాజీరెడ్డి మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతాపం ప్రకటించారు. సోషల్ మీడియా వేదికగా ఓ ట్వీట్ చేశారు. ఉప్పల్ నియోజకవర్గానికి ఎన్నో సేవలు అందించిన మాజీ ఎమ్మెల్యే బండారు రాజిరెడ్డి మరణం విచారకరమన్నారు. రాజిరెడ్డి ఓ నిబద్ధత కలిగిన ప్రజా నాయకుడిగా ప్రజల మనస్సులో ఎప్పటికీ నిలిచి ఉంటారని తెలిపారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. రాజీరెడ్డి 2009లో కాంగ్రెస్ పార్టీ ఉప్పల్ ఎమ్మెల్యేగా పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పై విజయం సాధించారు. 2014లో ఆయన సోదరుడు బండారి లక్ష్మారెడ్డి ఉప్పల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ లో చేరి 2023లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రాజీరెడ్డి మృతి పట్ల పలువురు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు సంతాపం తెలుపుతున్నారు.