వీర్ సావర్కర్‌పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆయన మనవడు రంజిత్ సావర్కర్ స్పందించారు. తన తాత గురించి తప్పుగా మాట్లాడినందుకు రాహుల్‌పై తీవ్రంగా మండిపడ్డారు. అంతేగాకుండా రాహుల్‌కు ఆయన సవాల్ విసిరారు.
దేశ భక్తుడు.. హిందుత్వ సిద్ధాంతకర్త అయిన సావర్కర్ ఎప్పుడు బ్రిటిష్ వారికి క్షమాపణలు చెప్పారో సాక్ష్యాధారాలతో నిరూపించాలని రాహుల్‌కు సవార్కర్ మనవడు సవాల్ చేశారు. దానికి సంబంధించిన పత్రాలను చూపించాలని డిమాండ్ చేశారు. రాహుల్ వ్యాఖ్యలు పిల్లల మాటల్లా ఉన్నాయని ఎద్దేవా చేశారు. రాజకీయ ప్రచారం కోసం దేశభక్తుల పేర్లను వాడుకోవటం తప్పని దుయ్యబట్టారు. ఇది చాలా పెద్ద నేరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో రాహుల్‌పై చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
తనపై అనర్హత వేటు పడిన తర్వాత మీడియా ముందుకు వచ్చిన రాహుల్ .. సావర్కర్ పేరును ప్రస్తావిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ‘నేను సావర్కర్‌ను కాను.. గాంధీని..! గాంధీలు క్షమాపణలు చెప్పరు’అని ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.