ఎస్‌బీఐ కొత్త స్కీముతో అదిరే లాభాలు..!

-

స్టేట్ బ్యాంక్ కస్టమర్స్ కి గుడ్ న్యూస్. ఎస్‌బీఐ sbi మ్యూచువల్ ఫండ్ అదిరే స్కీమ్ ని ఒకటి తాజాగా తీసుకు రావడం జరిగింది. దీనితో మంచి లాభం పొందొచ్చు. మరి ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..

ఎస్‌బీఐ /sbi

ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ కొత్త ఈటీఎఫ్‌ను ETF ఆవిష్కరించింది. కన్జంప్షన్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్‌ను లాంచ్ చేసింది. జూన్ 30న NFO ప్రారంభమైంది. అయితే ఇది జూలై 14 వరకు అందుబాటులో ఉంటుంది అని తెలిపారు.

దీనిలో చేరాలి అంటే తప్పక డీమ్యాట్, ట్రేడింగ్ అకౌంట్ ఉండాలి. అదే విధంగా మీరు ఈ ఫండ్‌లో చేరాలంటే కనీసం రూ.5 వేలు ఉండాలి గమనించండి. ఇది ఓపెన్ ఎండెడ్ స్కీమ్. దీర్ఘకాలంలో క్యాపిటల్ అప్రిసియేషన్ కోరుకునే వారికి ఇది చాల బెస్ట్ అని చెప్పొచ్చు.

ఇది ఇలా ఉంటే నిఫ్టీ ఇండియా కన్జంప్షన్ ఇండెక్స్‌లో ఇన్వెస్ట్ చేయాలని కనుక అనుకుంటే ఈ ఫండ్ చాలు. ఇక నిఫ్టీ గురించి చూస్తే.. నిఫ్టీ ఇండియా కన్జంప్షన్ ఇండెక్స్‌లో30 కంపెనీలు ఉంటాయి. డైవర్సిఫైడ్ పోర్ట్‌ఫోలియో కోరుకునే వారికి ఇది ఈ ఇండెక్స్ బాగుంటుంది.

సాధారణంగా మ్యూచువల్ ఫండ్స్‌లో కాస్త రిస్క్ ఉంటుంది. రిస్క్ లేకుండా మ్యూచువల్ ఫండ్స్‌ వుండవు కనుక మ్యూచువల్ ఫండ్స్‌లో డబ్బులు పెట్టే వారు కొన్ని విషయాలు గుర్తించుకోవాలి. రిస్క్ ఉండచ్చు.. నష్టం ఉండచ్చు. కాబట్టి డబ్బులు పెట్టె ముందు ఆలోచించి అప్పుడు పెట్టండి. లేదు అంటే నష్టం ఎక్కువగా ఉండచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version