‘పెన్షన్‌ జాప్యం’పై సుప్రీం ఆగ్రహం.. కేంద్రానికి రూ.2లక్షల జరిమానా

-

పెన్షన్ జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వానికి జరిమానా విధించింది. భారత సైన్యంలో రిటైర్డ్‌ రెగ్యులర్‌ కెప్టెన్లకు చెల్లించే పెన్షన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోకపోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘వన్‌ ర్యాంక్‌ వన్‌ పెన్షన్‌’ పథకం ప్రకారం పింఛను చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడింది. ఈ ప్రక్రియలో ఏళ్లతరబడి జాప్యం చేస్తోందని ఫైర్ అవుతూ .. కేంద్రానికి రూ.2 లక్షల జరిమానా విధించింది.

పదవీవిరమణ పొందిన అధికారుల పింఛనుకు సంబంధించి నెలకొన్న సమస్యలపై దాఖలైన పిటిషన్లను జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ ఆర్‌.మహదేవన్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం విచారించింది. ఈ క్రమంలో ఏళ్లతరబడి ప్రభుత్వం ఓ నిర్ణయానికి రాకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ప్రభుత్వానికి చివరి అవకాశం ఇచ్చిన సుప్రీంకోర్టు.. నవంబర్‌ 14లోగా సమస్యను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేసింది. లేదంటే పెన్షన్‌ పెంపుపై తామే ఆదేశాలు ఇవ్వాల్సి వస్తుందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news