దిల్లీలోని ఓల్డ్ రాజేంద్రనగర్‌లోని ఐఏఎస్ స్టడీ సెంటర్‌లోకి వరదనీరు పోటెత్తి ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన ఘటన గురించి తెలిసిందే. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ ప్రమాదానికి ముందు తీసిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారుతోంది. వీడియోలో వరద నీరు బేస్‌మెంట్‌లోకి ప్రవేశించడంతో లోపల ఉన్న విద్యార్థులు నీటిలో నుంచి మెట్ల మీదుగా బయటకు వస్తోంది కనిపిస్తోంది. లోపల ఉన్న విద్యార్థులు త్వరగా బయటకు రావాలంటూ ఓ వ్యక్తి చెబుతూ ఇంకెవరయినా లోపల ఉన్నారా అని ఆరా తీస్తున్నట్లుగా వీడియోలో వినిపిస్తోంది. మృతి చెందిన విద్యార్థులు బయటకు వచ్చేలోపే వరద చుట్టిముట్టి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
శనివారం సాయంత్రం రావూస్ స్టడీ సర్కిల్‌లోని బేస్‌మెంట్‌లోకి అకస్మాత్తుగా వరద నీరు ప్రవహించడంతో ముగ్గురు విద్యార్థులు తానియా సోని, శ్రేయా యాదవ్, నవిన్ డెల్విన్ మరణించారు. ఈ ఘటనతో కోచింగ్ సెంటర్ యజమాని అభిషేక్ గుప్తా, కో ఆర్డినేటర్ దేశ్‌పాల్ సింగ్‌లను అరెస్టు చేసి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు.
Painful death of three students who were trapped for over 4 hrs in an IAS coaching center in Delhi’s Rajendra Nagar, after water suddenly entered a basement.#Delhi #DelhiRains #Flood #RajendraNagar pic.twitter.com/nWsgh0cthT
— ѕυηιтαנα∂нαν (@01greenelephant) July 28, 2024